
ప్రపంచ ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో ఎన్నో మహిమాన్విత ప్రదేశాలు ఉన్నాయి. అందులో కుమార ధార తీర్థంది ప్రత్యేక స్థానం. తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటిని ఏ ఏడాది మార్చి 7వ తేదీ న నిర్వహించనున్నారు. ఈ తీర్థానికి ఉన్న చరిత్ర..ప్రత్యేకత కారణంగా ఆ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కుమార ధార తీర్థ లో స్నానం ఆచరించటానికి ప్రాధాన్యత ఇస్తారు. కుమార ధార తీర్ధానికి సంబంధించిన వరహ, మార్కండేయ, పద్మ పురాణాల ప్రకారం అనేక కధలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో..ఇప్పుడు ఈ తీర్ధం వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పుణ్యతీర్దానికి సంబంధించి ప్రధానం ఒక కధ ప్రచారంలో ఉంది. వృద్ద బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తున్న సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై ఆ వృద్ధ బ్రహ్మణుడితో ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావని ప్రశ్నించగా.. ఆ వృద్ధుడు.. తాను యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని స్వామివారికి చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడి సలహా ఇచ్చారని.. ఈ తీర్ధంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. అలా ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమార ధార’ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. కుమార తీర్ధ ముక్కోటికి భారీ సంఖ్యలో భక్తులు తీర్ధంలో స్నానం ఆచరించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. తిరుమలలో ప్రస్తుతం సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతున్నాయి.





