News

ఆలయ పూజల్లో తారతమ్యాలు వద్దు – మద్రాసు కోర్టు తీర్పు

286views

ఆలయ పూజల్లో తారతమ్యాలొద్దని, అందరినీ సమానంగా చూడాలని మద్రాసు హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. రాజపాళయానికి చెందిన మేడైయాండి తెన్‌కాశి జిల్లా తిరువేంగడంలోని కుల దేవత ఆలయానికి వెళ్లగా అక్కడ అగ్రవర్ణాలు అడ్డుకున్నారని, తాము కులదేవత ఆలయాన్ని దర్శించి పూజలు చేసేందుకు అనుమంతించేలా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరాడు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన న్యాయమూర్తి జీఆర్‌ స్వామినాథన్‌, ఆలయ పూజల్లో తారతమ్యాలు వద్దని, అందరిని సమానంగా చూడాలని పేర్కొన్నారు. దళితులు, నిమ్నజాతుల వారు ఆలయాలకు స్వేచ్ఛగా, స్వతంత్రంగా వెళ్లేలా జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ చర్యలు చేపట్టాలని కోరుతూ, తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.