News

రాజమహేంద్రవరం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధం

261views

పవిత్రగోదావరి నదీతీరం రాజమహేంద్రవరం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైంది. దక్షిణకాశీగా పేరుగాంచిన కోటిలింగాల క్షేత్రంతో పాటు పలు శివాలయాలు శివరాత్రి ఉత్సవానికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాజమహేంద్రవరంలో కోటిలింగాలరేవు, చింతాలమ్మ ఘాట్‌, పుష్కరాలరేవు, టీటీడీ ఘాట్‌, పద్మావతి ఘాట్‌, గౌతమి ఘాట్‌, సరస్వతిఘాట్లలో మహాశివరాత్రి పుణ్యస్నానాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పుష్కరాలరేవు మహాశివలింగం వద్ద జల్లు స్నానాలు, కోటిలింగాలరేవులో షవర్‌ బాత్‌కు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పుణ్యస్నానాలు చేసేందుకు దూరప్రాంతాల భక్తులు ఇప్పటకే రాజమహేంద్రవరం చేరుకున్నారు. నగరంలో ఉమాకోటిలింగేశ్వరాలయం, ఉమామార్కెండేశ్వరాలయం, విశ్వేశ్వరాలయం, మహాకాళేశ్వరాలయం, కళ్యాణి సమేత సోమలింగేశ్వరాలయం, సారంగధారేశ్వరాలయం, ఉమారామలింగేశ్వరాలయాలు ముస్తాబయ్యాయి. ఆయా ఆలయాల్లో వేకువజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, అర్చలు నిర్వహించే ఏర్పాట్లు పూర్తయ్యాయి.