
330views
మంత్రాలయం- వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రహ్లాదరాయలు రజత గజ వాహనంపై వైభవంగా ఊరేగారు. దశమి వేడుకల్లో భాగంగా మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. ప్రహ్లాదరాయలకు పాద పూజ చేసి రజత గజ వాహనంపై బంగారు అంబారీలో స్వామివారిని అధిష్టించి పీఠాధిపతి మహా మంగళహారతులు ఇచ్చి ముందుకు నడిపించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.





