
640views
పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో ఓ ఎన్నికల అధికారి అదృశ్యమయ్యారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లకు ఇన్‌ఛార్జ్ అయిన అర్నబ్ రాయ్ గురువారం ఎన్నికల విధుల్లో భాగంగా విప్రదాస్ చౌదరీ పాలిటెక్నిక్ కాలేజీలో విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజనానికి అని వెళ్లిన రాయ్ తిరిగి రాలేదు. తోటి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అర్నబ్ కోసం గాలిస్తున్నారు. అతడి కారు డ్రైవర్‌ను విచారిస్తున్నారు.





