
1.2kviews

విజయవాడ అయోధ్యనగర్, రామలింగేశ్వర పేటలోని హైందవి వద్ద ఈ రోజు చలివేంద్రం ప్రారంభించారు. ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య చేతుల మీదుగా ఈ చలివేంద్రం ప్రారంభించబడింది. ఆరెస్సెస్ విజయవాడ విభాగ్ వ్యవస్థా ప్రముఖ్ శ్రీ పవన్ కుమార్ భారతమాత చిత్రపటానికి నారికేళ సమర్పణ గావించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక ప్రాంత కార్యదర్శి శ్రీ వలివేటి సత్యనారాయణ మూర్తి, ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ నరసయ్య, కార్యకర్తలు శ్రీనివాసరాజు, శుభాకర్ తదితరులు పాల్గొన్నారు.






