
288views
కొంత మంది యువకులు వృద్ధులకంటే నీరసంగా బద్ధకంగా బతికేస్తూ ఉంటారు. ఇలాంటి వారికీ ఆదర్శంగా కొంతమంది వృద్ధులు నిలుస్తూ ఉంటారు. తమ వయసు సంకల్పానికి అడ్డుకాదని తరచుగా నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ బామ్మా.. యువతతో పోటీపడుతూ మారథాన్ లో పాల్గొంది. అవును 80 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండేంత అదృష్టం అతి కొద్ది మందికేనని చెప్పొచ్చు. అలాంటి వయసులో ఓ బామ్మ ఏకంగా పరుగు పందెంలో హుషారుగా పాల్గొన్నారు. 18వ ఎడిషన్ టాటా ముంబై మారథాన్ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. ముంబై వాసులు ఈ పరుగులో పాల్గొనగా.. భారతి అనే వృద్దురాలు చీర కట్టుకుని, కాళ్లకు షూ ధరించిన ఓ బామ్మ వారితో కలసి పరుగు అందుకున్నారు. ఆమెను చూసిన చాలా మంది ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. ఆమె మనవరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.





