News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

348views

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం బుధవారం 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు అయిదు సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 74,436 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. దాదాపు 27,269 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.