News

చార్మినార్‌ వద్ద పోలీసుల సోదాలు

336views

భాగ్యనగరం: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ చార్మినార్‌ ప్రాంతంలో పోలీసుల సోదాలు చేపట్టారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోమవారం చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లోని హోటళ్ళు, దుకాణాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది గమనించిన కొంతమంది భయపడి బాంబు కోసమే తనిఖీలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు చార్మినార్‌కు ఎలాంటి బాంబు బెదిరింపు కాల్ రాలేదని.. ఇదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. చార్మినార్‌ వద్ద సాధారణ తనిఖీలే చేపట్టామని వెల్లడించారు. ఇదే విషయమై చార్మినార్‌ ఎస్‌ఐ స్పందించారు. పోలీసులకు ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదని చెప్పారు. బాంబు బెదిరింపులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టివేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి