
387views
న్యూఢిల్లీ: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అత్యుత్తమ పురస్కారం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు ఆయన వరించింది. ఆదివారం గోవాలోప్రారంభమైన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది.
సినీ పరిశ్రమకు చిరు అందించిన విశేష సేవలకు ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా, ఇప్పటి వరకూ ఈ అవార్డును అమితాబ్, సలీమ్‌ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్ జోషి, వహీదా రెహమాన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందుకున్నారు.
Source: Nijamtoday





