News

అఫ్తాబ్ చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధావాల్కర్‌కు ఘన నివాళులు(వీడియో)

185views

మంచిర్యాల: ఢిల్లీలో తల్లిదండ్రుల మాట కాదని ప్రేమికుడు ఆఫ్తాబ్‌ను నమ్మి, అతనితో సహజీవనం చేసి, దారుణ హత్యకు గురైన శ్రద్ధావాల్కర్‌కు పలువురు ఘన నివాళులర్పించారు. తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా, చెన్నూరులో శుక్రవారం యువతీయువకులు, ఇతరులు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. బాధితురాలు శ్రద్ధావాల్కర్‌కు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరాస్ట్రాలో ఘన నివాళులర్పించారు.

 https://twitter.com/i/status/1593611782421037056

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి