News

జాతి వివక్ష … ముస్లిం డ్రైవర్నితొలగించిన ఉబర్.

689views

తాను నడుపుతున్న కారులో ఒక యూదు జంటను ఎక్కించుకోవడానికి నిరాకరించిన ఒక ముస్లిం డ్రైవర్ని ప్రముఖ రవాణా సంస్థ ఉబర్ తన సంస్థ నుంచి తొలగించింది.

జ్యూయిష్ క్రానికల్ అనే ఒక యూదు పత్రిక కధనం ప్రకారం ఒక యూదు జంట తమ ప్రయాణ నిమిత్తం ఉబర్ యాప్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకున్నారు. వారు యూదులని తెలుసుకున్న ఆ క్యాబ్ డ్రైవర్ అహ్మద్ ఆ బుకింగ్ ను రద్దు చేశాడు.

దీనితో ఆగ్రహించిన ఉబర్ యాజమాన్యం అతనిని వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉబర్ ప్రతినిధి ఒకరు జ్యూయిష్ క్రానికల్ తో మాట్లాడుతూ డ్రైవర్ యొక్క ప్రవర్తన ఏ విధంగానూ క్షమార్హం కాదని, ఎట్టి పరిస్థితులలోనూ ఇలాంటి వివక్షను తాము సహించబోమని తెలిపారు. సంస్థ వెనువెంటనే తమ యాప్ నుంచి అతనిని తొలగించడమే కాకుండా దీనిపై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.