
347views
ఉదయ్‌పూర్: ఉదయ్‌పూర్-అహ్మదాబాద్ మధ్య కొత్తగా ప్రారంభమైన రైల్వే ట్రాక్‌ను దుండగులు పేల్చివేశారు. దీంతో పట్టాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన అధికారులు రైళ్ళ రాకపోకల్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అసర్వా-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లడానికి కొన్ని గంటల ముందు రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించడంతో ట్రాక్‌లకు పగుళ్ళు ఏర్పడ్డాయి. దీంతో ఆ మార్గంలో వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును దుంగార్‌పూర్‌లో నిలిపివేసినట్టు రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, ఈ పేలుడుకు డిటోనేటర్లు వాడినట్టు సమాచారం.
Source: Eenadu





