
భువనేశ్వర్: ఇక్కడ ఈ-కుంభ్ పోర్టల్ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇస్తూ సుమారు 12 భాషలకు చెందిన పుస్తకాలను ఆ సైటలో పొందుపరిచారు. ఈ-కుంభ్ అనగా నాలెడ్జ్ అన్‌లీష్డ్ ఇన్ మల్టిపుల్ భారతీయ లాంగ్వేజెస్. ఈ వెబ్ పోర్టల్‌లో ఇంజినీరింగ్ పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ పుస్తకాలను ఒడియా భాషలో రాష్ట్రపతి ముర్ము విడుదల చేశారు. కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మినాలజీ (సీఎస్టీటీ) ఒడియా భాషలో డెవలప్ చేసిన సుమారు 50వేల టెక్నికల్ టర్మ్స్‌ను కూడా ఆ భాష సైట్‌లో పొందుపరిచారు.
సాంకేతిక విద్యను చాలామంది విద్యార్థులు ఆంగ్లంలో అర్ధం చేసుకోలేకపోతున్నారని చెబుతూ అందుకనే నూతన విద్యావిధానంలో మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యత ఇచ్చిన్నట్టు రాష్ట్రపతి తెలిపారు. మాతృభాషలో విద్యాబోధన విద్యార్థులలో ఆలోచన శక్తిని, సృజనాత్మకతను, మేధోసంపదను పెంపొందింప చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. పైగా, విద్యాబోధనలో గ్రామీణ, పట్టణ విద్యార్థులకు సమాన అవకాశాలు లభిస్తాయని ఆమె తెలిపారు.
Source: Nijamtoday





