
318views
తిరుపతి: తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. 31 క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 30 గంటలు, రూ.300 దర్శనానికి 3 గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 68,995 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 29,037 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.3.71 కోట్లు వేశారు. తిరుమలలో గురువారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
5న డయల్ యువర్ ఈవో
డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఈ నెల 5న శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఫోన్‌లో తెలపవచ్చు. ఇందుకుగాను 0877–2263261 నంబర్‌ను సంప్రదించాలి.





