News

8న శ్రీవారి ఆలయం మూసివేత

355views

తిరుపతి: చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల ఎనిమిదోతేదీన 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఆ రోజున బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను, తిరుపతిలో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం–2 నుంచి దర్శనానికి అనుమతిస్తారు. ఆరోజు మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. రాత్రి 8.30 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి