
312views
తిరువనంతపురం: కేరళ తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామి ఉత్సవ మూర్తులను అంగరంగ వైభవంగా ఊరేగించారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షన్ముగం బీచ్ వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. ఎయిర్పోర్ట్ రన్‌వేపై నుంచి ఉత్సవం సాగిన నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగిన ఐదు గంటల సేపు విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రధాన ఎయిర్లైన్లకు చెందిన సుమారు 10 విమానాలు రీషెడ్యూల్ అయ్యాయి. అల్పశి ఆరట్టు పేరుతో ఏడాదికి రెండుసార్లు ఈ ఊరేగింపు నిర్వహిస్తారు. వందల సంవత్సరాల నుంచి ఇదే మార్గంలో ఊరేగింపు కొనసాగుతోంది. ఊరేగింపు జరిగే మార్గంలోనే 1932లో తిరువనంతపురం విమానాశ్రయం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం జరిగేటప్పుడు.. విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నారు.





