
386views
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు గట్టి షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. ఈ మేరకు శాసన సభ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ళపాటు జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఓ ఐఏఎస్ అధికారిపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. గురువారం సాయంత్రం తీర్పు వెల్లడించింది. ఇప్పటికే భూఆక్రమణ కేసులో అరెస్టయి దాదాపు రెండేళ్ళపాటు జైలు శిక్ష అనుభవించిన ఆయనకు సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆరంభంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వల్ల విడుదలయ్యారు. అవినీతి, చోరీతో పాటు ఆజంఖాన్‌పై దాదాపు 90 కేసులు ఉన్నాయి.





