News

గుజరాత్‌ దీపావళి వేడుకల్లో ఇస్లాంవాదుల హింస.. పోలీసులపై పెట్రోల్‌ బాంబులు!(వీడియో)

742views

వడోదర: గుజరాత్‌లోని వడోదరలో దీపావళి రాత్రి మత ఘర్షణలు చెలరేగాయి. మంగళవారం ఉదయం వరకు, పోలీసులు కనీసం డజను మంది అల్లరిమూకలను చెదరగొట్టారు. నిందితులను గుర్తించే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. నగరంలోని పానిగేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

స్థానిక మీడియాతో వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యస్పాల్ జగనియా మాట్లాడుతూ.. “హింసకు ఖచ్చితమైన కారణం ఇంకా కనుగొనబడలేదు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, నగరం నలుమూలల నుండి సిబ్బందిని సంఘటనా స్థలానికి తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇంటి టెర్రస్ నుండి పోలీసులపై పెట్రోల్ బాంబు విసిరారు. ఈ విషయంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఒక గుంపు ఆ ప్రాంతంలోని కొన్ని దుకాణాలను ధ్వంసం చేసింది. కొన్నింటికి నిప్పుపెట్టింది.

ఘర్షణ చెలరేగకముందే వీధి దీపాలు ఆపివేయబడ్డాయని, ఆ తర్వాత ఇరువర్గాల అల్లర్లు రాళ్ళు రువ్వడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. స్థానిక నివాసి తెలిపిన వివరాల ప్రకారం.. పానిగేట్ ప్రాంతంలోని ముస్లిం మెడికల్ కాలేజీ సమీపంలో బాణసంచా పేల్చడంతో ఘర్షణ జరిగింది.

ఇది ఘర్షణ ప్రారంభించడానికి తరచుగా ఉపయోగించే వ్యూహం. దీని ద్వారా ఇస్లాంవాదులు ముస్లిం-ఆధిపత్యం లేదా మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతాల్లో ముస్లిమేతర కార్యకలాపాలను, ముఖ్యంగా హిందూ పండుగ వేడుకలను తట్టుకోలేక నిషేధించడానికి పూనుకొంటారు. పాశ్చాత్య దేశాలలో కూడా ఇలాంటి ‘షరియా జోన్లు’ లేదా ‘నో-గో ఏరియాలు’ పెరగడం మొదలయ్యాయి. ఇటువంటివి భారత్‌లో వెయ్యి ప్రాంతాలు ఉన్నాయి.

వడోదరలోని ఈ ప్రాంతంలో హిందూ పండుగ వేడుకల సమయంలో హింస సాధారణంగా కనిపిస్తుంది: “ఆగస్టులో గణేష్ చతుర్థి సందర్భంగా కూడా ఈ ప్రాంతంలో పరిస్థితి వేడెక్కింది. గణేష్ విసర్జన సందర్భంగా ఊరేగింపుపై రాళ్ళు రువ్వడంతో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా, నవరాత్రుల సమయంలో కూడా అదే ప్రాంతంలో ఇటువంటి ఘర్షణలు జరిగాయి.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి