News

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోం: బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌

393views

అమరావతి: వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, టీడీపీతో తాము పొత్తు పెట్టుకోమని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అడిగిన రోడ్‌ మ్యాప్‌పై అంతర్గంగా చర్చించుకుంటామన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా తీసుకోవట్లేదన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఏపీలో ఓటు వేసిన ప్రజలకే వైకాపా వెన్నుపోటు పొడుస్తోందని సునీల్‌ దేవ్‌ధర్‌ విమర్శించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి