
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని పెట్టుకున్న లక్ష్యంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ‘రోజ్‌గార్ మేళా’ను ప్రారంభించారు.
ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 75వేల మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉపాధి కల్పన, స్వయం ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇదో కీలక మైలురాయి అని అభివర్ణించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ”ప్రస్తుతం ప్రపంచం పరిస్థితి బాగోలేదు. కరోనా మహమ్మారి కారణంగా మనం వందేళ్లలోనే అదిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. దీని ప్రభావం ప్రతి చోటా ఉంది. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా సతమతమవుతున్నాయి. కరోనా దుష్ప్రభావాలైన నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం చాలా దేశాల్లో గరిష్ఠాలకు చేరుతున్నాయి. ఇలాంటి సమస్యలను కేవలం 100 రోజుల్లో పరిష్కరించుకోలేం. ఈ సవాళ్ల నుంచి బయటపడేందుకు భారత్ కూడా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
Source: Eenadu





