
346views
అచ్చంపేట: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ప్రతిభ కనబర్చిన నల్లమల విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయినట్టు వనవాసీ కల్యాణ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 15న హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో రాష్ట్రస్థాయి పోటీలు ఏర్పాటు చేశారు. అచ్చంపేట పట్టణంలోని మల్లికార్జున విద్యార్థి నిలయం
విద్యార్థులు అనిల్, విజయ్ ప్రతిభ చూపి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు డిసెంబర్ 17న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్న పోటీలలో పాల్గొననున్నారని తెలిపారు. జాతీయస్థాయి పోటీలలో రాణించడమే ధ్యేయంగా నిత్యం విలువిద్య శిక్షణ కొనసాగినట్టు పేర్కొన్నారు.
Source: Eenadu





