
409views
ముంబయి: పాదరక్షల్లో కొకైన్‌ను అక్రమ రవాణా చేస్తున్న ఓ మహిళను ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె పాదరక్షలలో నుంచి రూ.4.9 కోట్లు విలువ చేసే 490 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. అనుమానంతో మహిళను ఎయిర్‌పోర్ట్‌లో అడ్డగించిన అధికారులు.. అనంతరం పాదరక్షలను తనిఖీ చేశారు. అందులో కొకైన్ ప్యాకెట్లను గుర్తించారు. ఈ నేపథ్యంలో మహిళను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
Source: EtvBharat





