News

ఏసీ నగర్‌లో ఘ‌నంగా విజయదశమి ఉత్సవం

275views

నెల్లూరు: విజయదశమి ఉత్సవం నెల్లూరు, ఏసీ నగర్‌లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శ‌నివారం జరిగింది. కార్య‌క్ర‌మానికి రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ‌(ఆర్ఎస్ఎస్) ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహ కార్య‌వాహ‌ దువ్వూరు యుగంధర్ పాల్గొని సమాజం శక్తివంతం కావాలంటే శ్రీ శక్తి జాగరణ ఒక్కటే మార్గమని అన్నారు. అలాగే, దుర్గాష్టమి సందర్భంగా శక్తి స్వరూపిణి దుర్గామాతను ఆరాధిస్తూ సమాజాన్ని శక్తివంతం చేయడానికి ప్రయత్నిద్దామ‌న్నారు. రాష్ట్ర సేవికా స‌మితి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో 55 మంది పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి