News

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సీబీఐ కొరడా

341views
  • ఆపరేషన్ గరుడ పేరుతో 175 ప్రాంతాల్లో దాడులు

న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సీబీఐ ‘ఆపరేషన్‌ గరుడ’ పేరిట దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఎన్సీబీ, ఇంటర్‌పోల్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని పోలీసుల సమన్వయంతో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లపై దాడులు కొనసాగించింది. ఈ సందర్భంగా భారీగా మాదకద్రవ్యాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 127 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 175మంది డ్రగ్స్‌ వ్యాపారులను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.

అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలను విచ్ఛిన్నం చేయడంతో పాటు డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఈ వారం ఆరంభం నుంచి కొనసాగిన ‘ఆపరేషన్‌ గరుడ’లో భాగంగా ఆయా ఏజెన్సీలు 127 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాయని తెలిపారు.

పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మహారాష్ట్ర సహా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్సీబీ అధికారులు, పోలీసులు ఈ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 6,600 మంది అనుమానితులను ట్రాక్‌ చేశారు. ఆ తర్వాత 127 కేసులు నమోదుచేసి పరారీలో ఉన్న ఆరుగురితో పాటు మొత్తం 175మందిని అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి