
న్యూఢిల్లీ: మాజీ నటి ఆషా పరేఖ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆషా పరేఖ్ 95 చిత్రాల్లో నటించారు. దిల్ దేకే దేకో, కటీ పతంగ్, తీస్రీ మంజిల్, బహారోంకే సప్నే, ప్యార్ కా మౌసమ్, కారవాన్ లాంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. 1952లో రిలీజైన ఆస్మాన్ చిత్రంలో ఆమె బాలనటిగా చేశారు. కథానాయికగా దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, రాజేష్ ఖన్నా వంటి నటులతో తెరను పంచుకున్నారు.
ఆ తర్వాత రెండేళ్ళుకు బాప్ బేటి చిత్రంలో నటించింది. ఘోరా కాగజ్ టీ.వీ షోలో ఆమె పాత్రను పోషించారు. 1950-60 మధ్య అగ్రశ్రేణి నటీమణుల్లో ఒకరిగా ఉన్నారు. ఆషా పరేఖ్ 95 చిత్రాల్లో నటించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీలోని అయిదుగురు సభ్యులు ఆషా పరేఖ్ పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ కమిటీలో ఆషా భోంస్లే, హేమా మాలిని, పూనమ్ దిల్లాన్, ఉదిత్ నారాయణ్, టీఎస్ నాగాభరణ ఉన్నారు.
Source: Nijamtoday





