News

విజయవాడ కనకదుర్గమ్మకు మూడు బంగారు కిరీటాలు కానుక

399views

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించారు. నవీ ముంబయి రెకాన్‌ మెరైన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థకు చెందిన జి.హరికృష్ణా రెడ్డి మూడు బంగారు కిరీటాలను తయారుచేయించి అమ్మవారిపట్ల తన భక్తిని చాటుకున్నారు.

కనకదుర్గమ్మ ఉత్సవ విగ్రహ అలంకరణ కోసం సుమారు 1308 గ్రాముల బరువు కలిగిన స్వర్ణ కిరీటాలను హరికృష్ణా రెడ్డి దేవస్థానం ఈవోకు అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం దాత కుటుంబానికి ప్రధానార్చకులతో వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం వారికి ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.