
415views
బాలాఘాట్: గోమాత విశిష్టతను తెలిసిన అక్కడి మహిళలు గోసంరక్షణకు కొంగుబిగించారు. రక్షణ లేని ఆవులను, ఇతరులు విరాళంగా ఇచ్చినవి, అక్రమంగా తరలిస్తున్న ఆవుల రక్షణ నిమిత్తం వారు.. తమ ఊరు బాలాఘాట్ జిల్లా, చందన గ్రామంలో ఓ గోశాలను నిర్మించారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఆ ఊరి పెద్దలు, సాధువులకు వివరించడంతో వారూ గోశాల నిర్మాణానికి తమ వంతు సహాయసహకారాలను అందించారు. హిందూ సంప్రదాయబద్ధంగా గోశాలను ప్రారంభించి, పలువురి మన్ననలు అందుకున్నారు.
Source: VSKMadhyapradesh





