News

చైనాలో భారీ భూకంపం

371views

* ఇళ్ళు, రోడ్లు ధ్వంసం

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8 గా నమోదైంది. 2017 తర్వాత చైనాలో ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే తొలిసారి. భూకంపం ధాటికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. లూడింగ్ అనే ప్రాంతంలో ఏర్పడిన ఈ భూకంపం తీవ్రతకు పలు ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.