
395views
* కేంద్రం కీలక నిర్ణయం
దేశ రాజధాని నగరంలోని చారిత్రక రాజ్ పథ్ (Rajpath) పేరు ఇక మారబోతోంది. దీన్ని కర్తవ్య పథ్ (Kartavyapath) గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇందులో భాగంగా సెప్టెంబర్ 7న న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రతిపాదనను కౌన్సిల్ ముందుంచనున్నట్టు తెలుస్తోంది. నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న రోడ్డు పేరును కర్తవ్యపథ్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. బ్రిటిష్ పాలనలో రాజ్‌పథ్ ను కింగ్స్ వే అని పిలిచేవారు.





