News

లండన్లో నీరవ్ మోడీ అరెస్ట్

815views

నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యారు. లండన్ లో నీరవ్ మోడీని అదుపు లోకి తీసుకున్నారు. మనీలాండరింగ్‌ కేసులో నీరవ్‌ మోడీని తమకు అప్పగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌  బ్రిటన్‌ను కోరింది. భారత్‌ వినతిపై స్పందించిన వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు రెండు రోజుల క్రితం నీరవ్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.  పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీకి రెండు రోజుల క్రితం వెస్ట్ మినిస్టర్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి లోన్లు తీసుకున్న నీరవ్ ఆ స్కాం బయటపడిన తర్వాత విదేశాలకు పారిపోయారు. ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు ఈడీ, సీబీఐ ప్రయత్నాలు చేస్తున్నాయి.  కొద్ది రోజుల క్రితం నీరవ్ మోడీ లండన్ వీధుల్లో కనిపించిన సంగతి తెలిసిందే. లండన్ లో నీరవ్ మోడీ ఉన్నట్లు తెలుస్తోంది. 8 మిలియన్ పౌండ్ల విలువైన అపార్ట్మెంట్ లో నీరవ్ మోడీ ఉన్నారు. సోహోలో అతడు కొత్తగా డైమండ్ బిజినెస్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక రోడ్డు మీద నడుస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. నీరవ్ మోడీ తన లుక్ ను కూడా మార్చివేశాడు. మీసాలను కూడా బాగా పెంచేశాడు.  విలువైన జాకెట్ ను ధరించి నీరవ్ మోడీ కనిపించాడు వీడియోలో.