News

దేశ వ్యాప్తంగా మట్టి వినాయకులకు పెరుగుతున్న ఆదరణ…

451views

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ‌తో చేసే విగ్రహాలే అందంగా ఉంటాయి, వాటితోనే ఎత్తైన విగ్రహాలను తయారు చేయడం సాధ్యమనుకునే స్థాయి నుంచి మట్టితోనూ అందమైన, భారీ విగ్రహాలను తయారు చేయవచ్చని నిరూపిస్తున్నారు పలు ఉత్సవ కమిటీల నిర్వాహకులు. వీటి వల్ల పర్యావరణానికి ఏమాత్రం ప్రమాదం ఉండదంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాలలోని గణేశ్‌ ఉత్సవ కమిటీలు కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు వంటి చోట్ల భక్తులు, ఉత్సవ కమిటీల సహాయంతో గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్న నిర్వాహకులు…. బంగాల్ నుంచి ప్రత్యేకంగా కళాకారులను తీసుకువచ్చి …. కావాల్సిన పరిమాణం, ఎత్తు, ఆకృతుల్లో విగ్రహాలు తయారు చేపిస్తున్నారు. ఈ విగ్రహాల్లో పర్యావరణానికి హాని చేసే రసాయనాలు ఏమాత్రం లేకుండా పూర్తిగా గడ్డి, మట్టి, కర్రలు, పొట్టుతో తయారు చేస్తున్నారు. విగ్రహాలు అందంగా కనిపించేందుకు వాడే రంగులూ హానికరమైనవి కాదని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రకృతి ప్రేమికులతో పాటు ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత మట్టి విగ్రహాలనే వాడాలని ఉత్సవ కమిటీల నిర్వాహకులు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.