News

పొట్టలో కొకైన్ తో పట్టుబడ్డ విదేశీయుడు

444views

* విమానాశ్రయంలో దిగగానే కడుపు నొప్పి రావటంతో గుట్టు రట్టు‌

గుట్టుగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న విదేశీయుడిని పట్టుకున్న కోల్‌కతా మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారులు నిందితుడి కడుపులో నుంచి 44 డ్రగ్స్‌ క్యాప్సూల్స్ ని‌ స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో క్యాప్సూల్‌ బరువు పది గ్రాములకు పైగా ఉంది. మొత్తం అరకిలో కొకైన్ ‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్రెజిల్ ‌కు చెందిన 31 ఏళ్ల పాల్‌ సీజర్‌ కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకోగానే కడుపునొప్పి మొదలైంది. అప్రమత్తమైన అధికారులు..

హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం స్కానింగ్‌ చేయగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్ట్‌ చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.