
382views
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగానికి, ఫుట్‌బాల్ అభిమానులకు తీపి కబురు ఇది. బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఎత్తివేసింది. ఫిఫా డిమాండ్లకు తగ్గట్టుగా ఏఐఎఫ్‌ఎఫ్ చర్యలు తీసుకోవడంతో ఈ నిషేధం తొలగిపోయింది. పాలకుల కమిటీ (సీఓఏ)ను సుప్రీం కోర్టు రద్దు చేయడం, సమాఖ్యపై నియంత్రణ ఏఐఎఫ్‌ఎఫ్ చేతికి రావడంతో ఫిఫా బ్యూరో మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 11 నుంచి 30 వరకు అండర్-17 అమ్మాయిల ప్రపంచకప్ భారత్‌లోనే జరుగుతుంది.





