
-
అమెరికాలో 1500 మంది విద్యార్థుల పారాయణం
-
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
-
అమెరికాలో ఆగస్టు 13 “గీతా సహస్రగళ దినం”గా ప్రకటన
వాషింగ్టన్: పరాయి దేశంలో సనాతన ధర్మ మూలాలను పెంపొందిస్తూ, ‘గీత సహస్రగళ’ కార్యక్రమంలో శిక్షణ పొందిన 700 మంది నిష్ణాతులైన వారితోపాటు 1,500 మందికి పైగా విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను పఠించారు. ఇది ఈ నెల 13, 2022న టెక్సాస్‌లోని డల్లాస్‌లో అవధూత దత్త పీఠం ద్వారా జరిగింది.
అలెన్ ఈవెంట్ సెంటర్‌లో శ్రీ గణపతి సచ్చిందానంద స్వామీజీ దివ్య సన్నిధిలో వారం రోజుల పాటు నిర్వహించే ‘గీత సహస్రగళ’ కార్యక్రమంలో ఇది ఒక భాగం.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,500 మందికి పైగా విద్యార్థులు 700 శ్లోకాలతో కూడిన మొత్తం భగవద్గీతను అక్షరం పొల్లుపోకుండా పఠించారు. ఇది ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్లో గొప్పది. దీనిని నిర్వాహకులు ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఫ్రిస్కోలోని కార్య సిద్ధి హనుమాన్ దేవాలయం (KSHT) స్థాపకుడు శ్రీ గణపతి సచ్చిందానంద స్వామీజీ “గీత మహాయజ్ఞం” కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇది ఒక చారిత్రాత్మక క్షణం… ఎందుకంటే ఈ ఈవెంట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. నివేదికల ప్రకారం, వారు ఈ రికార్డు కోసం దాదాపు ఒక సంవత్సరం పాటు అభ్యాసం చేశారు.
సామూహిక మంత్రోచ్ఛారణ పూర్తయిన తర్వాత, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి పూజ్య శ్రీ స్వామీజీకి ‘అతిపెద్ద ఏకకాల హిందూ వచన పఠనం’ పురస్కరించుకొని గిన్నిస్ ప్రపంచ రికార్డును అందించారు. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, ఫ్రిస్కో నగర మేయర్ ఆగస్టు 13, 2022ని “గీతా సహస్రగళ దినం”గా ప్రకటించారు.
Source: VSKBharat





