News

బీహార్‌లో 72 శాతం మంత్రులపై క్రిమినల్ కేసులు

349views

బీహార్‌: బీహార్‌లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 70 శాతానికి పైగా మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల హక్కులకు చెందిన సంస్థ ఎడిఆర్ వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై కూడా కేసులు ఉన్నాయని ఎడిఆర్ తెలిపింది.

2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసిన 32 మంది మంత్రుల స్వయం ప్రకటిత అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) విశ్లేషించి తన నివేదిక వెల్లడించింది. 32 మంత్రులలో 23 మందిపై (72 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయని, 17 మందిపై (53 శాతం)పై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎడిఆర్ తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి