News

ఇండియా కీ ఉడాన్…

394views

* 75 ఏళ్ళ స్వతంత్ర భారత ప్రస్తానంపై వీడియో రూపొందించిన గూగుల్

రాజ్యాంగం రూపొందించుకోవడం.. ఎన్నికలు నిర్వహించుకోవడం.. ఇలా బ్రిటిష్‌ వాళ్ల నుంచి స్వాతంత్ర్యం సాధించిన తొలినాళ్లలో భారత్‌ అడుగులివీ. ఆ తర్వాత 75 ఏళ్ల కాలంలో మన దేశం అనేక మైలురాళ్లను అధిగమించింది. హరిత విప్లవం.. అంతరిక్షంలోకి శాటిలైట్లు పంపడం మొదలు.. క్రికెట్‌ ప్రపంచకప్ ‌ను ముద్దాడడం…. కోవిడ్ వ్యాక్సిన్ ను కనుగొనడం…. వరకు అనేక ఘనతలు సాధించింది.

ఒకప్పుడు టెక్నాలజీయే పరిచయం లేని దేశం.. నేడు డిజిటల్‌ చెల్లింపుల్లో అగ్రగామిగా నిలిచింది. ఇలా చెప్పుకొంటూ పోతుంటే భారత్‌ సాధించిన విజయాలెన్నో. వీటన్నింటికీ ఓ వీడియో రూపం ఇచ్చింది గూగుల్‌. 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ‘ఇండియా కీ ఉడాన్‌’ పేరుతో దీన్ని విడుదల చేసింది. ఆ వీడియో మీరూ చూసేయండి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.