
-
పెళ్ళిళ్ళు, డబ్బుల కోసం వేధింపులు
-
ముస్లిం పురుషులను నమ్మొద్దంటున్న ఓ బాధితురాలు
-
అసొంలో హిందూ మహిళలే లక్ష్యం చేసుకున్న ముస్లిం అరెస్ట్
గువాహటి: అసొంలో కొత్త గ్రూమింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దొంగ పేరుతో సమాజంలో తిరగడం, హిందూ భార్యను, ఇతర హిందూ మహిళలను హింసించడం, గొడ్డు మాంసం తినమని బలవంతం చేయడం వంటి చర్యల వల్ల పోలీసులు అబ్దుల్ సాజహాన్‌ను అరెస్టు చేశారు. అతను అమ్మాయిలను ట్రాప్ చేయడానికి మింటూ రాయ్‌గా తన పేరును మార్చుకున్నాడు.
ఈ విధంగానే ఓ హిందూ మహిళను మోసం చేశాడు. అబ్దుల్ సాజహాన్ మోసాన్ని కనిపెట్టలేకపోయిన ఆమె వివాహానికి అంగీకరించింది. ఇద్దరూ గౌహతిలోని కామాఖ్యా దేవి మందిర్‌లో వివాహాన్ని ఘనంగా జరుపుకొన్నారు. బాధితురాలికి ఆరు నెలల తర్వాత నిందితుడి నిజస్వరూపం తెలిసింది. సాజహాన్‌కు అప్పటికే పెళ్ళయిందని వెలుగులోకి వచ్చింది. అప్పటికే బాధితురాలి వద్ద ఏడు లక్షల రూపాయల నగదు ఉన్నట్టు సాజహాన్ పసిగట్టాడు.
తర్వాత ఆ డబ్బు కోసం ఆమెను హింసించడం ప్రారంభించాడు. అతను ఆమెకు గొడ్డు మాంసం కూడా బలవంతంగా తినిపించాడు. అతను ఆమె డబ్బును లాక్కొని, మరో హిందూ యువతిని ట్రాప్ చేయడానికి ఉపయోగించాడు. ఆ మహిళ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. తేజ్‌పూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
‘ముస్లిం పురుషులను నమ్మొద్దు’
ఆ మహిళ తనకు ఎదురైన కష్టాల గురించి ఈటీవీ భారత్ (అసొం)తో మాట్లాడింది. ”ముస్లిం పురుషులను వివాహం చేసుకోవద్దని హిందూ మహిళలకు నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. వారి ఉచ్చులో జాగ్రత్త వహించండి… వారు మిమ్మల్ని కొంత కాలం పాటు ఉంచి, ఆపై శారీరకంగా హింసిస్తారు, మీకు ఆహారం ఇవ్వడం మానేస్తారు” అని బాధితురాలు చెప్పినట్టు తెలిసింది.
Source: HINDU POST





