News

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగ‌స్వాములు కండి

420views

నంద్యాల: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్త‌యిన శుభ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాలు నిర్వ‌హిస్తోంద‌ని, ఈ కార్య‌క్ర‌మంలో అందరం భాగ‌స్వాములు కావాల‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌) క‌ర్నూలు విభాగ్ సంప‌ర్క ప్ర‌ముఖ్, రిటైర్డ్ జ‌డ్జి శివ‌ప్ర‌సాద్ పిలుపునిచ్చారు.

మ‌హానంది ఖండ‌, తిమ్మాపురంలో ఏపీ మోడల్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు. విద్యార్థులు, ప్ర‌జ‌లు ఈ ఉత్స‌వాల్లో పాల్గొని రాబోవు త‌రాల‌ను ఆద‌ర్శంగా నిల‌వాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయ‌ణ‌, ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రావు, విద్యార్థిని, విద్యార్థులు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అలాగే, నంద్యాల, బొమ్మల సత్రం వ‌ద్ద గ‌ల నలంద పబ్లిక్ స్కూల్‌లో కూడా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’ పుర‌స్క‌రించుకుని కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. వక్తగా విభాగ్ సంపర్క్ ప్రముఖ్ శివప్రసాద్‌, ప్రిన్సిపాల్ శ్రీ ప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని నాగదీపు, జింక రాఘవ నిర్వహించారు. శ్రీవేంకటేశ్వర విద్యా మందిర్ లో కూడా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. వక్తగా విభాగ్ సంపర్క్ ప్రముఖ్ శివప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటరాముడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సుబ్బారావు నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి