
గాంధీనగర్: కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ పిలుపు మేరకు 2002 అల్లర్ల తర్వాత గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్, ఇతరులు కుట్ర పన్నారని కోర్టులో గుజరాత్ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, అధికార బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం మొదలైంది.
తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటీషన్‌ను గుజరాత్ పోలీసులు వ్యతిరేకిస్తూ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిడ్‌లో ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి సీఎం నరేంద్ర మోదీని ఇరికించేందుకు దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ చేసిన కుట్రలో తీస్తా కూడా ఒక భాగమని పోలీసులు తమ ఆఫిడవిట్ లో పేరొన్నారు.
అఫిడవిట్‌లో నిజానిజాలు వెల్లడయ్యాయని, బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ “కుట్ర” పన్నారని, ఈ ప్రయత్నంలో అహ్మద్ పటేల్ ఆమె “కీలుబొమ్మ” అని బీజేపీ ఆరోపించింది.
Source: Nijamtoday





