News

స్నేహితులతో క‌లిసి ప్రియురాలిపై ముస్లిం యువకుడు సామూహిక అత్యాచారం!

430views

పాట్నా: ప్రియురాలు ఒకే ఒక్క విషయంలో తన మాట వినలేదని ఆ ముస్లిం యువకుడు కోపం పెంచుకున్నాడు… ఓ రోజు ఊరి బయటకు రమ్మని అతడు చేసిన నిర్వాకం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.

బీహార్ రాష్ట్రం సీతామర్హి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మొహమ్మద్‌ అనే వ్యక్తి, 22 ఏళ్ళ యువతికి మధ్య ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. మొన్నటి వరకూ వారి మధ్య ఎలాంటి గొడవలూ జరగలేదు. అయితే ఇటీవల పెళ్ళి చేసుకుందామంటూ మొహమ్మద్‌.. తన ప్రియురాలిపై ఒత్తిడి చేస్తున్నాడు. అయితే, ఇందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయమై రోజూ గొడవలు జరిగేవి. దీంతో ప్రియురాలిపై కోపం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో జూన్ 24న ప్రియురాలిని ఊరి బయట నిర్జన ప్రదేశానికి పిలిచాడు. అక్కడికి రాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. తర్వాత అయితే గ్రామ పెద్దలు ఇద్దరినీ పిలిపించి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారు కూడా పెళ్ళి చేసుకోమని చెప్పడంతో చివరకు చేసేదేమీ లేక.. గురువారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి