
-
24న భారత వాయుసేనలో నియామకాలు
-
భారత వాయుసేనాధిపతి వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్రం అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్ పథకం కింద నియామక ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తామని ఇప్పటికే ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే వెల్లడించారు. తాజాగా వాయు సేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి కూడా దీనిపై స్పందించారు. జూన్ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
”యువత సాయుధ బలగాల్లో చేరేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది. 17.5 ఏళ్ల నుంచి 21ఏళ్ల మధ్య వయస్కులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా సైనిక నియామకాలు చేపట్టనందున.. అగ్నిపథ్ తొలి రిక్రూట్మెంట్కు గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచడం అభినందనీయం. ఇది యువతకు ప్రయోజనకరంగా ఉంటుంది. జూన్ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నిపథ్ కింద నియామక ప్రక్రియను ప్రారంభించనున్నాం” అని ఓ వీడియో ప్రసంగంలో చౌధరి తెలిపారు.





