News

అమర్నాథ్ యాత్రకు ప్రథమ పూజ

533views

అమ‌ర్నాథ్‌: ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్రకు లాంఛనంగా శ్రీకారం చుడుతూ ప్రథమ పూజను నిర్వహించారు. దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని పరమశివుని పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌లో జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పూజలు జరిపారు.

అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తుంది. శ్రీ అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం బోర్డు సీఈవో నీతీశ్వర్‌ కుమార్‌, సభ్యులు పూజల్లో పాల్గొన్నారు. అమర్‌నాథ్‌ యాత్రకు ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు తరలి రావచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి