News

పేద విద్యార్థినులకు మలబార్ గోల్డ్ వారి చేయూత

613views

నెల్లూరులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వారు నెల్లూరు జి.వి.ఆర్.ఆర్ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న 12 మంది పేద విద్యార్థినులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల వంతున స్కాలర్ షిప్ అందించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డ్ DVEO శ్రీ శ్రీనివాసరావు, RIO శ్రీ వరప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బాలాజీ రవికుమార్, మలబార్ గోల్డ్ అధినేతలు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా DVEO శ్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎవరికైనా విద్య అమూల్యమైన సంపదగా భాసిల్లుతుందని, ఎవరూ దొంగిలించలేని సంపద విద్య మాత్రమేనని, అలాంటి విద్యను గడించినవారు గొప్ప సంపన్నులవుతారని చెప్పారు. విద్యాదానం చేసేవారేవరైనా వారికి జీవితానికి సరిపడా నిధిని అందించినవారవుతారని, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, నెల్లూరు వారు నేడు ఆ పుణ్య కార్యాన్ని నిర్వహించి చరితార్థులయ్యారని కొనియాడారు.

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, నెల్లూరు బ్రాంచ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతిభ కలిగిన నిరుపేద బాలికలకు ఆర్ధిక సహకారాన్ని అందించే అవకాశం తమకు రావడం ఎంతో ఆనందకరమని పేర్కొన్నారు. క్రమశిక్షణకు, ఉత్తమ విలువలతో కూడిన విద్యాబోధనకు మారుపేరైన విద్యాసంస్థ అయినందునే జీవీఆర్ఆర్ కళాశాల విద్యార్థినులకు ఈ ఆర్ధిక సహకారాన్ని అందించటానికి తాము ముందుకొచ్చామని, కళాశాలకు వచ్చి, అక్కడి పరిస్థితులను చూశాక తమకు మరింత ఆనందంగానూ, గర్వంగానూ ఉన్నదని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.