
507views
ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వోద్యోగం వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. చుట్టాలకి, స్నేహితులకి గర్వంగా చెప్పుకుంటారు. అందరినీ పిలిచి సంబరాలు చేసుకుంటారు. కానీ ఒక మూర్ఖుడు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. భార్యను సదరు ఉద్యోగానికి వెళ్ళొద్దని బలవంతం చేశాడు. అయినా ఆమె విన్కపోయేసరికి ఏకంగా ఆమె చేయి నరికేశాడు.
పశ్చిమ బెంగాల్ కోజల్సాకు చెందిన రేణు ఖాతున్ ప్రైవేట్ నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో పాసై ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. అందుకు భర్త షేర్ మహమ్మద్ అంగీకరించలేదు. ఉద్యోగం మానేయమని పట్టుబట్టాడు. ఆమె వినకపోవడంతో పదునైన ఆయుధంతో చేయి నరికేశాడు. వైద్యులు ఆమె చేయిని కొంతభాగం తొలగించి, వైద్యం చేశారు.





