News

తమిళనాడులో చేపలవేట పండుగ

489views

చెన్నై: తమిళనాడులో చేపల వేట పండగ సందడిగా సాగింది. పుదుక్కొట్టై జిల్లాలో పెద్ద సంఖ్యలో ప్రజలు వలలు పట్టుకొని చేపలు పడుతూ కోలాహలంగా గడిపారు. స్థానికులు ఏటా చేపల పండగను ఘనంగా జరుపుకొంటారు. పంట కోతలు పూర్తైన తర్వాత ఈ వేడుకలు చేసుకుంటారు. గ్రామంలోని ప్రజలంతా ఇందులో పాల్గొంటారు. చెరువులోకి వెళ్ళి చేపలు పట్టి చాలా సంతోషంగా పండుగ చేసుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం ఈ వేడుకకు వస్తుంటారు. కులమతాలకు అతీతంగా ఈ వేడుకలు జరుగుతుండటం విశేషం.

విరుదునగర్ జిల్లాలోని కరియపత్తి పట్టణం కంబికుడి గ్రామంలో 12ఏళ్ల తర్వాత ఈ వేడుకలు జరిగాయి. 1440 ఎకరాల్లో విస్తరించిన ప్రాంతంలో ప్రజలు ఈ ఉత్సవాలు చేసుకున్నారు. స్థానిక అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం.. చేపలు పట్టి ఆనందంలో మునిగి తేలారు. 300 గ్రామాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి