
520views
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ మఠం వద్ద కత్తితో దాడి చేసిన అహ్మద్ ముర్తజాకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఆ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులకు ఆయన నిధులను అందజేస్తున్నట్టు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ శాంతిభద్రతల విభాగం అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, గోరఖ్‌నాథ్ మఠం వద్ద కత్తితో దాడి చేసిన అహ్మద్ ముర్తజాకు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నిందితుడు తన బ్యాంకు ఖాతాల ద్వారా దాదాపు రూ.8.5 లక్షల మేరకు ఐసిస్ కార్యకలాపాల కోసం అందజేసినట్టు తెలిపారు.
Source: NationalistHub





