News

రూ.1300 కోట్ల విలువైన డ్రగ్స్​​​ సీజ్​!

415views

గాంధీన‌గ‌ర్‌: మాదకద్రవ్యాల ముఠాపై గుజరాత్​ ఏటీఎస్​ ఉక్కుపాదం మోపుతోంది. కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ కోట్ల రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలను పట్టుకుంది. తీగ లాగితే డొంక కదిలినట్లు తాజాగా ఓ నిందితుడిని విచారించగా.. భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఉత్తర్​ప్రదేశ్​, ముజఫర్​నగర్​ జిల్లా మొహళ్ళ‌ కిద్వాయినగర్​ ప్రాంతంలో గుజరాత్​ ఏటీఎస్​ తనిఖీలు చేపట్టింది. సుమారు రూ.1300 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టుకుంది.

మూడు రోజుల క్రితం దిల్లీ షాహీన్​బాగ్​లో అఫ్గానిస్థాన్​ నుంచి నగరానికి వచ్చిన 97 కిలోల హెరాయిన్​ సహా రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది ఎన్​సీబీ. ఈ కేసులో ఖైరానాకు చెందిన అహ్మద్​, ఇద్దరు అఫ్గానిస్థానీలను అరెస్ట్​ చేసింది. అహ్మద్​ను విచారించగా.. ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​కు చెందిన హైదర్​ పేరు బయటకు వచ్చింది. దీంతో హైదర్​ను అదుపులోకి తీసుకుని విచారించాయి ఎన్​సీబీ, గుజరాత్​ ఏటీఎస్​. ఈ క్రమంలో ముజఫర్​నగర్​లోని తన ఇంటిలో డ్రగ్స్​ దాచినట్టు ఒప్పుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు కిద్వాయి నగర్​కు ఓ టీమ్​ వెళ్ళి అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా.. భారీగా డ్రగ్స్​ బయటపడ్డాయి. హైదర్​తో పాటు ఇమ్రాన్​ అనే వ్యక్తి ఈ కేసులో ఉన్నట్లు తెలిసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి