
637views
న్యూఢిల్లీ: వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనాతో ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల మన దళాలు కీలకమైన ప్రదేశాలలో భౌతికంగా మోహరించి ఉన్నాయి. యథాతథ స్థితిలో ఎలాంటి మార్పును, భూభాగాన్ని కోల్పోవడాన్ని మనం అనుమతించబోము అని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం చేశారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుసటిరోజు సైన్యం గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ఎదురు కాగల ముప్పు అంచనాలను మన దళాల మోహరింపును మారుస్తూ ఉంటామని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు చర్చల ప్రక్రియ ఒక్కటే పరిష్కారం అని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు వెంబటి ఉద్రిక్తలను తగ్గించడం కోసం అవసరమైన అన్ని చర్యలను తీసుకొంటాము అని భరోసా ఇచ్చారు.
Source: Nijamtoday





