
421views
న్యూఢిల్లీ: గ్లోబల్ ఆయుష్ సమ్మిట్ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టెడ్రోస్‌ని కొత్త పేరుతో పిలుస్తానంటూ మోదీ చెప్పారు.
అనంతరం టెడ్రోస్‌ను తులసీభాయ్‌గా ప్రధాని పేర్కొన్నారు. అనంతరం డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆవిష్కరిస్తుందంటూ ప్రశంసించారు. సంప్రదాయ వైద్య విధానాలను కాపాడుకోవడంలో ఇండియా ఛాంపియన్‌గా నిలుస్తోందన్నారు.





